Telugu upcoming channels

  • Thread starter Thread starter b.phanikrishna
  • Start date Start date
  • Replies Replies: Replies 4
  • Views Views: Views 1,915
Joined
7 Aug 2016
Messages
9
Reaction score
3
ETV going lunch few more tv channels for devotional, educational and for former (for both andhra and telangana)

According to some resource from the internet and as my guess, zee Telugu music channel also will come. because music channel lunch is very easy compared to the movie channel. Zee Telugu already announces  the zee cinimalu.
 
భారీ విస్తరణకు ఈటీవీ కసరత్తు, తెలుగులో మరో 7 చానల్స్? | Telug...

భారీ విస్తరణకు ఈటీవీ కసరత్తు, తెలుగులో మరో 7 చానల్స్?
Posted by teluguTV Team On March 21, 2016 0 Comment
ఈటీవీ గ్రూప్ ఇతర భాషల చానల్స్ ను వదులుకున్నప్పటికీ మళ్ళీ విస్తరణ దిశలో భారీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రారంభించిన నాలుగు చానల్స్ తో కలిపి 7 చానల్స్ గ్రూపుగా తయారౌన ఈటీవీ ఇప్పుడు ఇంకో 7 చానల్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అదే సమయంలో తొమ్మిది భాషల్లో ఆ ఏడు చానల్స్ తీసుకువచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే, చానల్ ప్రారంభించటమంటే ఆషామాషీగా కాకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకునే ఈటీవీ గ్రూప్ తన కొత్త చానల్స్ ను 2016 చివర్లో ప్రారంభించవచ్చునని భావిస్తున్నారు. ఆధ్యాత్మికం, విద్య తదితర రంగాలకు చెందిన చానల్స్ ఇందులో ఉంటాయని చెబుతుండగా వ్యవసాయం మీద మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు వేరు వేరు చానల్స్ ప్రసారమవుతాయని తెలుస్తోంది.

అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే దిశలో విభిన్నమైన చానల్స్ ప్రారంభించి అన్నిటినీ ఒక బొకేలో పే చానల్స్ గా అందించటం ద్వారా లబ్ధిపొందవచ్చునని ఈటీవీ యాజమాన్యం అంచనా వేస్తోంది. ప్రకటనల ఆదాయానికి పే చానల్ ఆదాయం తోడైతే ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టాలు వచ్చే అవకాశం లేదన్న నమ్మకమే యాజమాన్యాన్ని ఈ భారీ ప్రయత్నం వైపు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.
 
లైసెన్స్ కోసం చూస్తున్న ’జీ సినిమాలు’ : త్వరలో జీ తెలుగు హెచ్ డి కూడా ప్రారంభం
Posted by teluguTV Team On July 13, 2016 0 Comment
తెలుగులో మ్యూజిక్, మూవీ చానల్స్ కూడా తీసుకురావాలని మూడేళ్ళూగా ఆలోచిస్తున్న జీ గ్రూప్ ముందుగా సినిమా చానల్ అందించబోతోంది. జీ సినిమాలు పేరుతో లైసెన్సుకోసం దరఖాస్తు చేసుకుంది. మరో నెలరోజుల్లోనే ఈ చానల్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. నిజానికి తెలుగులో ప్రధానమైన నాలుగు చానల్ గ్రూపులూ ఇప్పటికే ఎక్కువ చానల్స్ నడుపుతూ ఉండగా జీ టీవీ ఒక్కటే ఒంటరిగా ఉంది. జెమిని గ్రూప్ 8 చానల్స్, ఈటీవీ గ్రూప్ 7 చానల్స్, స్టార్ ఆధ్వర్యంలోని మాటీవీ గ్రూప్ 4 చానల్స్ నడుపుతూ ఉండగా జీ గ్రూప్ తెలుగు చానల్ జీ తెలుగు ఒకే చానల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే మూవీస్ చానల్ అందించబోతోంది.

ఇలా ఉండగా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ( జీల్ ) త్వరలో తెలుగుతో సహా మూడు భాషల్లో హెచ్ డి చానల్స్ అందించబోతోంది. ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ చానల్స్ నే హెచ్ డి లో కూడా అందించబోతోంది. వాటిలో తెలుగు, మరాఠీ, బెంగాలీ చానల్స్ ఉన్నాయి. అయితే జీ మరాఠీ హెచ్ డి, జీ బంగ్లా హెచ్ డి చానల్స్ కు ఇప్పటికే లైసెన్స్ ఉండగా తెలుగు చానల్ కు ఇంకా లైసెన్స్ రావాల్సి ఉంది. అంతకుముందు అందుబాటులో ఉన్న రెండు లైసెన్సులకు పేర్లు మార్చుకోవటం ద్వారా అది సాధ్యమైంది.
 
Back
Top Bottom